తెలంగాణ
Konda Surekha: ఒకప్పటి ఫైర్ బ్రాండ్ ఇప్పుడు ఫుల్ సైలెంట్.. కొండా సురేఖ మౌనం వెనుక అర్థమేంటి?
Konda Surekha: తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎప్పుడూ ఫైర్ బ్రాండ్‌గా, ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే నాయకురాలిగా కొండా సురేఖకు ప్రత్యేక గుర్తింపు ఉంది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయిందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మంత్రి పదవి పోయినప్పటి నుంచి మాజీ మంత్రి, వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే కొండా సురేఖ పూర్తిగా సైలెంట్ అయిపోయారని, ఎక్కడా బహిరంగంగా కనిపించడం లేదని స్థానికంగా వినిపిస్తోంది. ఒకప్పుడు నిత్యం ప్రజల్లో, మీడియాలో ఉండే కొండా ఫ్యామిలీ ఇప్పుడు ఇంతలా మౌనం వహించడం వెనుక అసలు కారణం ఏంటన్న దానిపై రకరకాల విశ్లేషణలు మొదలయ్యాయి.
