తెలంగాణ
Konda Surekha: నా కూతురు చేసిన వ్యాఖ్యలకు నాకెందుకు నోటీసులు
Konda Surekha: టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసులకు మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. ఈ మేరకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి కొండా సురేఖ లేఖ రాశారు. అందులో ఘాటుగా స్పందించారు. తన కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలు అని తేల్చి చెప్పారు. ఒకరి అభిప్రాయాలకు మరొకరు బాధ్యత వహించాలనడం సరికాదన్నారు. నా కూతురు చేసిన వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయటం సమంజసం కాదన్నారు.
