‘కొండా సురేఖను బర్తరఫ్ చేయాల్సిందే : సీఎల్పీ నేతలు
అధికార కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి మీద కొండా సురేఖ కూతురు సుస్మిత సంచలన ఆరోపణలు చేయడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు భగ్గమంటున్నారు. నిన్న తన కూతురు చేసిన వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదని, అవి తన వ్యక్తిగతమని మంత్రి కొండా పార్టీ క్రమశిక్షణా కమిటీ ఎదుట హాజరై వివరణ ఇచ్చింది.అయితే, మంత్రి కొండా చెప్పిన సమాధానంతో పార్టీ సంతృప్తి చెందలేదని సమాచారం.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కొందరు గాంధీభవన్ వేదికగా సమావేశం అయ్యారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకుని కొండా సుస్మిత చేస్తున్న విమర్శలపై పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష (CLP) వేదికగా 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అత్యవసర ప్రెస్‌మీట్ నిర్వహించి కొండా సురేఖను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని,పార్టీ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
