తెలంగాణ
పోలీసుల విచారణకు కొండా సురేఖ మాజీ ఓఎస్డీ
Sumanth: కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ ఎట్టకేలకు పోలీసుల విచారణకు హాజరయ్యాడు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు వచ్చాడు. ఓ రియల్టర్ పై దాడి కేసులో సుమంత్ ను పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటివరకు సుమంత్ గైర్హాజరులోనే ఉన్నాడు. ఇటీవల సుమంత్ కు నాంపల్లి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సుమంత్ తో పాటు మరో ముగ్గురికి షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఇదే సమయంలో సుమంత్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యాడు. పోలీసుల విచారణ తర్వాత ఏం జరగబోతోంది అనేది ఉత్కంఠగా మారింది.
