సభకు రాని కొండా సురేఖ.. సొంత ఎజెండాతోనే ముందుకు!
TG : మంత్రివర్గం నుంచి తొలగించినప్పటి నుంచి సీనియర్ నాయకురాలు కొండా సురేఖ అడుగులు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పదవి ఊడగానే "త్వరలోనే నా దారెంటో చూపిస్తా" అంటూ హెచ్చరికలు చేసిన సురేఖ, ఆ తర్వాత మిన్నకుండిపోవడం వెనుక ఉన్నది నిస్తేజం కాదు... విస్ఫోటనానికి ముందున్న నిశ్శబ్దమేనా అనే సందేహాలు స్టార్ట్ అయ్యాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో, కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ సభకు విధిగా హాజరవుతుంటే సురేఖ మాత్రం అసెంబ్లీ గేటు కూడా తొక్కకపోవడం అధికార పార్టీలో తీవ్ర అంతర్మథనానికి దారితీసింది.ఎప్పుడూ దూకుడైన రాజకీయాలు చేసే కొండా దంపతులు ప్రస్తుతానికి కామ్‌గా కనిపిస్తున్నా, ఈ మౌనం వెనుక భారీ ప్రణాళికే దాగి ఉందన్నది రాజకీయ వర్గాల అంచనా. అసెంబ్లీని బాయ్‌కాట్ చేయడం ద్వారా ప్రభుత్వానికి దూరంగా జరిగిన సురేఖ, సరైన ముహూర్తం చూసి కాంగ్రెస్‌పై ఏ తరహా బాంబు పేలుస్తారో అన్న ఉత్కంఠ ఇప్పుడు గాంధీభవన్‌లో మొదలైంది.
