తెలంగాణ

పాలమూరు లేకపోతే కేసీఆర్ అడుక్కుతింటుండే.. కోమటిరెడ్డి ఫైర్!

Komatireddy Venkat Reddy: దేవరకద్ర నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గులాబీ బాస్‌ కేసీఆర్, కేటీఆర్‌లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాలమూరు ప్రజల ఆదరణ వల్లే కేసీఆర్ సీఎం అయ్యారని గుర్తుచేసిన ఆయన.. కేటీఆర్‌ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేయడంతో సభా ప్రాంగణం ఒక్కసారిగా హోరెత్తింది.బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. "ఆనాడు మహబూబ్‌నగర్ ప్రజలు ఎంపీగా గెలిపించకపోతే కేసీఆర్ ఇంట్లోనే పడుకుంటుండే. పాలమూరు ప్రజలు పెట్టిన రాజకీయ బిక్ష వల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. వారి అండదండలే లేకుంటే బయట అడుక్కుతింటుండేవాళ్లు. అలాంటిది పదేళ్లు రాష్ట్రాన్ని ఏలిన కేసీఆర్.. తనను గెలిపించిన పాలమూరు గడ్డకు చేసిందేంటి? పదేళ్ల పాలనలో తెలంగాణ మీద పడి రాష్ట్రాన్ని నిలువునా దోచుకుని లక్షల కోట్ల అప్పులపాలు చేశారు. చివరకు తండ్రీకొడుకులు కలిసి 100 ఎకరాల అక్రమ ఆస్తులను కూడబెట్టడమే పనిగా పెట్టుకున్నారు" అంటూ నిప్పులు చెరిగారు.