తెలంగాణ
నాకు సీఎం అయ్యే టైమ్ వస్తే బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు
Komatireddy Rajagopal Reddy: కాంగ్రెస్ పార్టీలో హాట్ కామెంట్స్ కు కేరాఫ్ గా మారిన నల్గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తనదైన శైలి వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తాను ఉన్నంతవరకు కాంగ్రెస్ పార్టీని ఎవరూ కబ్జా చేయలేరని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఇతర పార్టీ నేతలను చేర్చుకోవడం మంచిదే.. కానీ, వారు తమ ఇంట్లోకి వచ్చి తమనే వెళ్లగొడతామంటే మాత్రం ఊరుకునేది లేదన్నారు రాజగోపాల్ రెడ్డి. నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణవెల్లంలలో వైఎస్ఆర్ వర్థంతి కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.
