తెలంగాణ

మీనాక్షి నటరాజన్‌కు షాకిచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీ మీద ధిక్కార స్వరం వినిపిస్తున్న మనుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ఆ పార్టీలో కొత్త చర్చకు తెరతీశారు. మంగళవారం యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల ముఖ్య నేతలతో మీనాక్షి నటరాజన్ నిర్వహించిన పీఏసీ మీటింగ్‌కు ఆయన హాజరుకాలేదని తెలుస్తోంది. దీంతో మీనాక్షి నటరాజన్ మునుగోడు ఎమ్మెల్యే మీద గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగానే కాకుండా కాంగ్రెస్ పార్టీలో మరోసారి చర్చకు దారి తీసింది.