సినిమా
Kollywood - Trisha: లండన్‌లో త్రిష కొత్త చిత్రం ప్రారంభం!
Kollywood: సీనియర్ స్టార్ హీరోయిన్ త్రిష ప్రధాన పాత్రలో కొత్త తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ ప్రారంభమైంది. ఈ సినిమాకి దర్శకుడు రాజా కృష్ణ మేనన్. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మేకర్స్ 2026-09-03న అఫీషియల్‌గా ప్రకటించారు. మొదటిసారి పనోరమా స్టూడియోస్ కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, లోకోమోటివ్ గ్లోబల్ తో కలిసి నిర్మిస్తుండటం విశేషం. ఇక, ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లండన్‌లో మొదలైంది.
