తెలంగాణ
Kollapur: యంగ్ ఇండియా స్కూల్‌పై జూపల్లి కీలక ఆదేశాలు.. అధికారులకు మంత్రి దిశానిర్దేశం!..
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణాలను నాణ్యతగా చేపట్టాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు.కొల్లాపూర్ నియోజకవర్గంలోని జటప్రోలులో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్మాణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
