National

National : కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు సర్కారీ కొలువు : సీఎం సువేందు

పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో దుర్గా పూజ నవరాత్రుల సందర్భంగా తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. చోర్‌బగాన్‌లోని దుర్గమాత పండాల్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఇప్పటివరకు 19మంది చనిపోయారు. క్షతగాత్రులకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.ఈ ప్రమాదం చోటుచేసుకోవడానికి కారకులైన నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలాఉండగా, తొక్కిసలాటలో మరణించిన కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగంతో పాటు రూ.25 లక్షల పరిహారం అందజేస్తామని సీఎం సువేందు అధికారి ప్రకటించారు. సీఎం, సీఎస్ కలకత్తా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. గాయపడిన వారికి అయ్యే పూర్తి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు.