చిత్రం లేదు
National

Kolkata: కోల్‌కతాలో దారుణం.. ప్రేమ వ్యవహారంలో తండ్రీకొడుకులను నగ్నంగా ఊరేగించారు!

Kolkata: ప్రియురాలిని ముద్దుపెట్టుకున్నాడన్న కారణంతో ఓ యువకుడితో పాటు అతడి తండ్రి, స్నేహితుడి బట్టలు విప్పించి, తుపాకీతో బెదిరిస్తూ వీధుల్లో నగ్నంగా ఊరేగించిన అత్యంత అమానుష ఘటన కోల్‌కతాలో తీవ్ర కలకలం రేపింది. నాగరిక సమాజం తలదించుకునేలా సాగిన ఈ దాష్టీకం తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అసలేం జరిగిందంటే.. కోల్‌కతాలోని బెహాలా ప్రాంతానికి చెందిన 18 ఏళ్ల యువకుడు తన స్నేహితుడితో కలిసి ప్రియురాలైన మైనర్ బాలికను కలిసేందుకు వెళ్లాడు. అక్కడ ఇద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో ఆ యువకుడు ఆమెకు ముద్దు పెట్టాడు. అయితే, దీన్ని బాలిక బంధువుల్లో ఒకరు దూరం నుంచి చూసి వెంటనే ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు.