రేవంత్ ఇలాకలో సన్నబియ్యం దందా
రాష్ట్రంలో జోరుగా సన్నబియ్యం అక్రమ దందా కొనసాగుతోంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచి కర్ణాటకకు పెద్దఎత్తున పీడీఎస్ రైస్ సరఫరా అవుతున్నట్టు సమాచారం.కేవలం వికారాబాద్ జిల్లాలోనే ప్రతినెలా రూ.10 కోట్ల సన్న బియ్యం అక్రమ దందా అవుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డుల లబ్ధిదారులకు మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడంతో కొందరు దుండగులు అక్రమాలకు తెర లేపినట్టు సమాచారం. ప్రతీ కుటుంబానికి దాదాపు 50 నుంచి 100 కేజీల సన్న బియ్యం రావడంతో వారి నుంచి ఒక్కో కేజీ రూ.10 నుంచి రూ.12కే కొనుగోలు చేసి అనంతరం దానిని దళారులు క్యాష్ చేసుకుంటున్నట్టు తెలిసింది. గ్రామాల్లో ఉదయమంతా తిరిగి బియ్యం సేకరించి, రాత్రికి రాత్రే కొడంగల్ నుంచి కర్ణాటకకు తరలిస్తున్నట్టు సమాచారం.రూ.10కి లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేసి, కర్ణాటకలోని గుర్మిట్కల్ మార్కెట్లో కేజీ బియ్యం రూ.40కి విక్రయిస్తున్నట్టు తెలిసింది.
