తెలంగాణ
స్వాతంత్య్ర వేడుకల్లో ఊహించని ట్విస్ట్.. పెట్రోల్‌తో మహిళ హల్చల్!..
కోదాడ మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఓ మహిళ తమ జీవనాధారమైన ఉద్యోగాలను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తూ పెట్రోల్ తాగేందుకు ప్రయత్నించడంతో కలకలం రేగింది. తల్లి సమస్యకు న్యాయం చేయాలంటూ ఆమె కూతురు కూడా మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కోదాడ మున్సిపాలిటీలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరైన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పులి రత్తమ్మ తన ఉద్యోగ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లేందుకు వినతిపత్రం సమర్పించారు. తమకు ఉద్యోగాలు కల్పించిన తర్వాత తొలగించారని, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆమె కోరారు. అయితే సమస్యపై వెంటనే స్పష్టమైన పరిష్కారం లభించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన రత్తమ్మ పెట్రోల్ తాగేందుకు ప్రయత్నించారు.
