ఏపీ

పోలీసులపై కత్తితో దాడి.. నిందితుడిపై కాల్పులు

ఓ కానిస్టేబుల్‌పై దాడి చేసి అవినాశ్ అనే వ్యక్తి పరారయ్యాడు. నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులకు కృష్ణా జిల్లా కంకిపాడు వద్ద ఉన్నట్టు సమాచారం లభించింది. రాత్రి 11 గంటల సమయంలో అతన్ని పట్టుకునేందుకు పోలీసులు వెళ్లగా...సీఐలు, కానిస్టేబుళ్లపై రాళ్లు, కత్తితో సదరు యువకుడు దాడికి యత్నించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే కానిస్టేబుల్ శ్రీనివాస్ ఛాతిలో అవినాశ్ కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని అక్కడి నుంచి క్షేమంగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, మిగతా వారిపైనా దాడికి అవినాశ్ ప్రయత్నించగా.. తప్పనిసరి పరిస్థితుల్లో నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. అతని కాళ్లపై కాల్పులు జరిపి అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.