హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగి కిడ్నాప్ కలకలం..
హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి కిడ్నాప్ కలకలం రేపింది. కత్తులతో బెదిరించి గుర్తు తెలియని దుండగులు కారులో ఎక్కించుకుని వెళ్లినట్టు సమాచారం. అనంతరం నిర్మాణంలో ఉన్న ఓ భవనంలోకి తీసుకెళ్లి డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేయించకున్నట్టు తెలిసింది. నిన్న సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. సాఫ్ట్వేర్ ఉద్యోగి సాఫ్ట్వేర్ శ్యామ్ నాగ్ శనివారం రాత్రి తన ఫ్రెండ్ భార్గవ్రాజ్తో కలిసి గోపన్‌పల్లిలో మద్యం తాగారు.భోజనం చేసేందుకు ఎన్టీఆర్ నగర్‌కు వెళ్లగా కారులో వచ్చి గుర్తు తెలియని వ్యక్తులు శ్యామ్‌ను కిడ్నాప్ చేశారు. ఈ ఘటన హైదరాబాద్ గోపన్‌పల్లిలోని ఎన్టీఆర్ నగర్లో చోటుచేసుకుంది. ఆ సమయంలో అక్కడే ఉన్న బాధితుడి ఫ్రెండ్ భార్గవ్ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యాడు.వెంటనే డయల్ 112కి కాల్ చేసి ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టి శ్యామ్ నాగ్‌ను గుర్తించారు.
