తెలంగాణ

Khammam: ఇళ్ల కూల్చివేతల నోటీసులు.. యువతి కన్నీళ్లు!

 ఖమ్మం నగరంలోని శ్రీనివాసనగర్ ప్రాంతంలో నివాసముంటున్న నిరుపేద కుటుంబాలకు మున్సిపల్ అధికారులు ఇళ్ల కూల్చివేత నోటీసులు జారీ చేయడం తీవ్ర కలకలం రేపింది. తమ ఇళ్లను కూల్చివేస్తామని బెదిరిస్తున్నారని, ఆక్రమణల పేరుతో నోటీసులు ఇచ్చి ఖాళీ చేయాలనడం అన్యాయమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఈ విషయమై బాధితులు రోడ్డుపై ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో తండ్రి లేక, చెవుడు-మూగ ఉన్న తల్లిని పోషించుకుంటున్న ఓ యువతి కాంగ్రెస్ ప్రభుత్వం తమ నివాసాలను తొలగించేందుకు సిద్ధపడటంపై కన్నీరుమున్నీరుగా విలపిస్తూ మీడియాతో తన ఆవేదనను వ్యక్తం చేసింది.