తెలంగాణ
Khammam: యాసంగి పంటలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి పొంగులేటి!?..
ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో వర్షాలు కురిసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, దీంతో రానున్న రోజుల్లో సాగునీటితో పాటు తాగునీటి సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉందని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గ పర్యటన సందర్భంగా మాట్లాడిన ఆయన.. ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు ఎలాగైనా సాగునీరు అందించే ప్రయత్నం చేస్తాం. కానీ రానున్న నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని రైతులు యాసంగి పంటలు సాగు చేయకుండా సహకరించాలని ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేశారు.
