తెలంగాణ

TG: ఖమ్మంలో జాలర్లను కాపాడబోయి.. 10 మంది రెస్క్యూ సిబ్బంది గల్లంతు!

G: వరదల్లో చిక్కుకున్న జాలర్లను ప్రాణాలకు తెగించి కాపాడేందుకు వెళ్లిన రెస్క్యూ టీమ్‌కే ముప్పు వాటిల్లింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి వద్ద అత్యంత విషాదకర సంఘటన వెలుగుచూసింది. చెరువులో చిక్కుకున్న మత్స్యకారులను కాపాడేందుకు రంగంలోకి దిగిన రెండు ఎస్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక శాఖ బోట్లు వరద నీటి ఉధృతికి కొట్టుకుపోయాయి. ఈ ప్రమాద సమయంలో ఆ రెండు బోట్లలో కలిపి మొత్తం 10 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం అందడంతో తీవ్ర కలకలం రేగుతోంది.వివరాల్లోకి వెళ్తే.. బేతుపల్లి చెరువులో వరద నీరు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఐదుగురు జాలర్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నీటి మధ్యలోనే చిక్కుకుపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్‌డీఆర్‌ఎఫ్, ఫైర్ రెస్క్యూ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు.