తెలంగాణ

Khammam: లంచగొండులపై ఏసీబీ ఉక్కుపాదం.. పౌర సరఫరాల శాఖ అధికారి ఇంట్లో సోదాలు!!

ఖమ్మం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారులు మరోసారి సోదాలు నిర్వహించారు.. పౌర సరఫరాల శాఖ అధికారి నరసింహారావు భారీగా అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారనే సమాచారంతో.. శుక్రవారం ఉదయం నుంచే ఏసీబీ బృందాలు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఏకకాలంలో ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, హైదరాబాద్ సహా మొత్తం ఏడు వేర్వేరు ప్రాంతాల్లో ఈ రైడ్స్ కొనసాగుతున్నాయి.