తెలంగాణ
Khairatabad Ganapati: ఖైరతాబాద్‌లో భక్తజన సంద్రం.. 75 వేల మందికిపైగా గణపయ్య దర్శనం!
వినాయక చవితి పర్వదినం వేళ భాగ్యనగరంలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ బడా గణేశుడి దర్శనం కోసం తొలిరోజే భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. వేలాదిగా తరలివచ్చిన భక్తజనంతో ఖైరతాబాద్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. సాయంత్రం 6 గంటల సమయానికే రికార్డు స్థాయిలో ఏకంగా 75 వేల మందికి పైగా భక్తులు శ్రీ పంచముఖ సంకటహర మహాగణపతిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
