తెలంగాణ

Khairatabad Bypoll: ఖైరతాబాద్ ఉపఎన్నిక హీట్.. బీఆర్ఎస్ అభ్యర్థి ఇతనేనా?

హైదరాబాద్ రాజకీయాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉపఎన్నికల నగారా మోగే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడటంతో ఇక్కడ బై-పోల్ అనివార్యమైంది. దీంతో తమ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో గులాబీ దళం అప్పుడే మైదానంలోకి దిగింది. ఆశావహుల జాబితా పెద్దదే ఉన్నప్పటికీ.. అధిష్టానం మాత్రం నియోజకవర్గ ఇన్‌చార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి వైపే పూర్తి మొగ్గు చూపినట్లు వార్తలు రావడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.