KTR: ఖైరతాబాద్ బైపోల్ ఎన్నిక.. కేటీఆర్ కు పెద్ద ఛాలెంజ్..?
KTR: తెలంగాణ రాజకీయాలు మరోసారి ఉప ఎన్నిక వేడితో రగులుతున్నాయి. పార్టీ ఫిరాయింపుల కేసులో దానం నాగేందర్ అనర్హత వేటును సుప్రీంకోర్టు సమర్థించడంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ బైపోల్ ఆసక్తి రేపుతున్నప్పటికీ, గులాబీ దళపతి కేటీఆర్కు మాత్రం ఇది సాధారణ ఎన్నిక కాదు; తన రాజకీయ భవిష్యత్తును, నాయకత్వ పటిమను తేల్చే జీవన్మరణ సమస్యగా మారనుంది. హైదరాబాద్లో ఇప్పటికే ఎదురైన పరాభవాలు, పార్టీ అధినేత కేసీఆర్ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కేటీఆర్కు ఈ ఉప ఎన్నిక పెద్ద సవాలుగా నిలవనుంది.హైదరాబాద్ అంటే బీఆర్ఎస్కు ఒకప్పుడు కంచుకోట. గ్రేటర్ ఎన్నికలైనా, అసెంబ్లీ ఎన్నికలైనా గులాబీ జెండా రెపరెపలాడేది. కానీ అధికారం కోల్పోయాక సీన్ రివర్స్ అయింది. గ్రేటర్ పరిధిలో ఇటీవల జరిగిన రెండు ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
