తెలంగాణ
Khairatabad By Election: ఖైరతాబాద్ ఉపఎన్నిక ఇప్పట్లో లేనట్లేనా.. ఏం జరగబోతోంది?
Khairatabad By Election: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ పతాక స్థాయికి చేరింది. దానం నాగేందర్‌పై అనర్హత వేటు, అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు గెజిట్ నోటిఫికేషన్ విడుదల కావడంతో ఖైరతాబాద్‌లో బైపోల్ నగారా మోగడం లాంఛనమేనని అంతా భావించారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు టికెట్ల లెక్కలు వేసుకుంటూ, గ్రౌండ్లో ప్రచారానికి సైతం సిద్ధమయ్యాయి. అయితే, హైకోర్టు సాక్షిగా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) చేసిన ప్రకటనతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ప్రస్తుతానికి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేది లేదని ఈసీ తేల్చిచెప్పడంతో.. "ఖైరతాబాద్ ఉపఎన్నిక ఇప్పట్లో లేనట్లేనా? అసలేం జరగబోతోంది?" అనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
