తెలంగాణ
మధుయాష్కీకి కీలక పదవి.. తెలంగాణ కాంగ్రెస్ పోస్టు వైరల్!
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌కు జాతీయ స్థాయిలో కీలక పదవి దక్కింది. ఆయనను ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (AIPC) చైర్మన్‌గా కాంగ్రెస్ అధిష్టానం నియమించింది.కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ నియామకానికి ఆమోదం తెలపగా.. ఈ విషయాన్ని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఇంతకుముందు ఈ పదవిలో ఉన్న ప్రవీణ్ చక్రవర్తి తమిళనాడు నుంచి రాజ్యసభకు ఎన్నికవ్వడంతో, ఆయన స్థానంలో మధుయాష్కీ గౌడ్‌కు ఏఐసీసీ ఈ బాధ్యతలను అప్పగించినట్టు తెలిసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ తెలంగాణ కాంగ్రెస్ ఆసక్తికర పోస్టు పెట్టింది.‘
