తెలంగాణ

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఆర్టీసీ - మెట్రో కామన్ పాస్ ధరలపై పున:సమీక్ష!

 హైదరాబాద్ నగరంలో ఇటీవల ప్రారంభించిన ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ఛార్జీలు అధికంగా ఉన్నాయంటూ వస్తున్న ప్రజా వ్యతిరేకతపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ప్రయాణికుల నుంచి వస్తున్న విజ్ఞప్తులు, ఫిర్యాదుల నేపథ్యంలో కామన్ పాస్ ధరలను పునఃపరిశీలించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచనల మేరకు త్వరలోనే రవాణా శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి, ధరల తగ్గింపుపై తగిన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు.