ఏపీ
Tirupati airport: కేంద్రం కీలక నిర్ణయం.. తిరుపతి ఎయిర్ పోర్టు ప్రైవేటీకరణకు పచ్చజెండా!
దేశవ్యాప్తంగా ప్రయాణికుల సేవలను మెరుగుపరచడం, మౌలిక వసతులను ఆధునికీకరించే లక్ష్యంతో 11విమానాశ్రయాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ తిరుపతి విమానాశ్రయాన్ని ప్రైవేటీకరించేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (EoI) జారీ చేసింది. పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్ షిప్ (PPP) పద్ధతిలో నిర్వహణ, అభివృద్ధి, ఆధునికీకరణ బాధ్యతలను ప్రైవేటు రంగానికి కట్టబెట్టనున్నారు. ఈ విడతలో కేంద్రం తొలిసారిగా 'బండ్లింగ్' అనే వినూత్న విధానాన్ని అమలు చేస్తోంది. వాణిజ్యపరంగా ఎక్కువ రద్దీ, లాభాలు ఉన్న విమానాశ్రయంతో తక్కువ రద్దీ ఉన్న విమానాశ్రయాన్ని కలిపి ప్రైవేట్ రంగానికి ఇస్తున్నారు.
