క్రైమ్
KetanAgarwalCase: కేతన్ అగర్వాల్ హత్య కేసులో పురోగతి.. కోర్టులో 5,053 పేజీల ఛార్జిషీట్ దాఖలు!
దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో మహారాష్ట్ర పోలీసులు విచారణ పూర్తి చేసి కోర్టులో ఛార్జిషీట్ సమర్పించారు. పుణె కోర్టులో దాఖలు చేసిన ఈ 5,053 పేజీల భారీ ఛార్జిషీట్లో ఈ దారుణ హత్య వెనుక ఉన్న కుట్ర, పథకరచన, అమలుకు సంబంధించిన ప్రణాళికను పోలీసులు సమగ్రంగా వివరించారు. ఈకేసులో ప్రధాన నిందితురాలైన కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి, మరో నిందితుడు రితేష్ హంగేలను అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
