National
Kerala: ఆకాశంలో ఆగిపోయిన ఇంజిన్.. పైలట్ల అప్రమత్తతతో తప్పిన ప్రమాదం!..
ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ఓ విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో సమస్య తలెత్తింది. దీంతో ఆ విమానాన్ని వెనక్కి మళ్లించి అత్యవసర ల్యాండ్ చేశారు. ఈ విమానం సోమవారం ఉదయం కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అబుధాబికి బయల్దేరింది. టేకాఫ్ అయిన సుమారు 50 నిమిషాల తర్వాత.. మొదటి ఇంజిన్‌లో ఆయిల్ తగ్గడాన్ని పైలట్లు గుర్తించారు. ఆయిల్ ప్రెజర్ ప్రమాదకర స్థాయికి చేరడంతో వెంటనే ఆ ఇంజిన్‌ను ఆపివేశారు. మిగిలిన ఒకే ఇంజిన్‌తో ప్రయాణం కొనసాగించడం కష్టం కావడంతో విమానాన్ని వెంటే వెనక్కి మళ్లించారు.
