International

విషాదంగా మారిన ప్రయాణం.. కొండ ప్రాంతంలో కూలిన హెలికాప్టర్ ఏడుగురు దుర్మరణం!..

సఫారీ టూర్ కోసం బయలుదేరిన హెలికాప్టర్.. కొండల మధ్య కుప్పకూలడంతో ఏడుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కెన్యాలోని సాంబూరు కౌంటీలో మౌంట్ ఒలోలోక్వే సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. లోయిసాబా కన్సర్వెన్సీ నుంచి ఈవాసో న్యిరో ప్రాంతానికి వెళ్తున్న హెలికాప్టర్‌లో పైలట్‌తో పాటు ఆరుగురు పర్యాటకులు ఉన్నారు. ప్రమాదంలో అందరూ మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు అమెరికా పౌరులు, ఈక్వెడార్ జాతీయ నిఘా విభాగం అధిపతి మిచెల్ సెన్సీ-కంట్యూగీ కూడా ఉన్నారు. ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. కెన్యా అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.