దళితులను తొక్కేందుకు కేసీఆర్ కుట్ర
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మీద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై దళిత సంఘాలు భగ్గుమన్నాయి. దళితులంటే బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఏమాత్రం గౌరవం లేదని, తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడితే ఊరుకునేది లేదని స్పష్టంచేశాయి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గులాబీ నేతలకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించాయి. దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వ్యవహరిస్తే ఎంతటి వారినైనా ఎదురిస్తామని హెచ్చరించాయి. దళితుల హక్కుల పరిరక్షణ కోసం ఎంత దూరమైనా పోరాడతామని వెల్లడించాయి. ఈ క్రమంలోనే అసెంబ్లీ స్పీకర్ మీద బీఆర్ఎస్ పార్టీ వైఖరిని, మాజీ సీఎం కేసీఆర్ తీరును నిరసిస్తూ దళిత సంఘాలు, కాంగ్రెస్ నాయకులు తుర్కపల్లి మండల కేంద్రంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో అధికార పార్టీ ప్రభుత్వ విప్లు బీర్ల అయిలయ్య, వేముల వీరేశం, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డిలు పాల్గొన్నారు. వారి నిరసనలకు మద్దతు తెలిపారు.
