తెలంగాణ

KCR: సర్‌పై సార్ గప్‌చుప్.. ‘దేశ్ కీ నేత’ మౌనం వెనుక మతలబేంటి?

KCR: "తెలంగాణే కాదు.. యావత్ దేశాన్ని మార్చేస్తాం.. దేశ్ కీ నేతగా ఢిల్లీ పీఠాన్ని కదిలిస్తాం!" అంటూ గులాబీ జెండాను జాతీయ స్థాయికి తీసుకెళ్లిన మాజీ సీఎం కే.చంద్రశేఖర రావు ఇప్పుడు ఎక్కడ? దేశ రాజధాని వేదికగా ఎన్నికల కమిషన్ తీరుపై, 13 కోట్ల ఓట్ల గల్లంతుపై సమస్త విపక్షాలు ఏకమై పోరాడుతుంటే.. జాతీయ రాజకీయాలను శాసిస్తానన్న కేసీఆర్ ఎందుకు ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారు? ఢిల్లీ నుండి గల్లీ దాకా ప్రజాస్వామ్య ఉద్యమం హోరెత్తుతుంటే, దేశ్ కీ నేత నోటికి తాళం పడటం వెనుక అసలు మతలబు ఏంటనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.అఖిలపక్షాలు పార్టీ జెండాలను పక్కనపెట్టి నిరసన గళం విప్పుతుంటే, కేసీఆర్ మాత్రం కనీసం ఒక్క ప్రెస్‌మీట్ పెట్టే సాహసం కూడా చేయకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. కేవలం కేటీఆర్ ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్టుతో చేతులు దులుపుకోవడం గులాబీ బాస్ మార్క్ రాజకీయానికి పూర్తి భిన్నం. "కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ, ఈడీ దర్యాప్తు కత్తి తలపై వేలాడుతుండటంతోనే కేసీఆర్ అడుగు ముందుకు వేయడం లేదా?