తెలంగాణ

కేసీఆర్ చట్టప్రకారం భూమి కొన్నాడు : కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీ వేదికగా కేసీఆర్ కుటుంబం ఆస్తుల మీద చేసిన ఆరోపణలకు తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మీద తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ పుట్టినప్పుడే ఆయన ఇల్లు రెండు ఎకరాల్లో ఉండేదని, ఆయన తండ్రికి వందల ఎకరాల భూమి ఉందని పేర్కొన్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చారు కాబట్టే వ్యవసాయం మీద ఉన్న మక్కువతో ఈనాటికీ వ్యవసాయం చేస్తూనే ఉన్నారని, ఆరోజుల్లోనే చింతమడకలో రెండెకరాల ఇళ్లు ప్రభుత్వ పాఠశాలకు దానం చేశారని పేర్కొన్నారు.కేసీఆర్‌కు ఎప్పటినుంచో వందల ఎకరాలు ఉన్నాయని చెప్పారు.కేసీఆర్ దొర అంటావా? లేక ఈ మధ్య సంపాదించుకున్నాడు అంటావా? ఏదో ఒకటి ఫిక్స్ అవ్వాలని సీఎం రేవంత్‌కు హితవు పలికారు.