తెలంగాణ
కేసీఆర్ మంచి వారు.. ఆయన మాటంటే మాటే : కొండా సురేఖ
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ గురించి మాజీ మంత్రి కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.మంత్రి పదవి నుంచి ఆమెను సీఎం రేవంత్ రెడ్డి బర్తరఫ్ చేయడంతో పలు మీడియా సంస్థలకు వరుస ఇంటర్య్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే కొండా సురేఖ మాజీ సీఎం కేసీఆర్ మీద చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గతంలో జరిగిన రాజకీయ అనుభవాలు, ప్రస్తుతం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ మీతో ఎలా ఉన్నారని ప్రశ్నించగా.. ఆయన చాలా మంచోడని సురేఖ పేర్కొన్నారు. ఎప్పుడైనా మంచిగా రిసీవ్ చేసుకునేవారని, చాలా హుందాగా వ్యవహరించేవారని వెల్లడించారు. ఎప్పుడు వెళ్లినా తమను ఎంతో గౌరవించారని, తమకు కేసీఆర్తో ఎప్పుడూ విభేదాలు రాలేదని స్పష్టంచేశారు.
