తెలంగాణ
అసెంబ్లీలో బలంగా పోరాడండి : కేసీఆర్
TG: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశాన్ని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఈ రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పనిసరిగా హాజరై.. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ సూచించారు. సభలో జరిగే ప్రతి చర్చలో చురుగ్గా పాల్గొనాలని దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా గులాబీ బాస్.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై పలు సూచనలు చేశారు. అసెంబ్లీ, మండలి సమావేశాలను ఎవరూ లైట్ తీసుకోవద్దని స్పష్టం చేశారు. ఇదే సమయంలో సీఎం రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన అట్టర్‌ఫ్లాప్ అయిందని విమర్శించారు.
