KCR: కేసీఆర్ రీ-ఎంట్రీ ప్లాన్ ఫిక్స్ అయ్యిందా.. కేటీఆర్ ప్రకటన వెనుక అసలు స్కెచ్ ఇదేనా?
KCR: తెలంగాణ శాసనసభ ఎన్నికల ఓటమి తర్వాత దాదాపు ఫామ్‌హౌస్‌కే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. మళ్లీ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమవుతున్నారా? గులాబీ బాస్ సెకండ్ ఇన్నింగ్స్‌కు రంగం సిద్ధమైందా? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్స్ తెలంగాణతో పాటు జాతీయ రాజకీయాల్లో సంచనాలు సృష్టిస్తున్నాయి. కేసీఆర్ త్వరలోనే పూర్తిస్థాయిలో రంగంలోకి దిగుతారని, దేశ రాజకీయాలను శాసించేలా కీలక పాత్ర పోషిస్తారంటూ కేటీఆర్ చేసిన ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర రాజకీయాలకే పరిమితమై అధికార కాంగ్రెస్‌పై పోరాడుతున్నారు. గతంలో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి మహారాష్ట్ర, పంజాబ్, యూపీ వంటి రాష్ట్రాల్లో భారీ బహిరంగ సభలు పెట్టిన కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికల పరాజయం తర్వాత జాతీయ బాటను పూర్తిగా పక్కన పెట్టేశారు.
