తెలంగాణ
KBRParkProject: ‘పూటకో మాట.. రోజుకో నిర్ణయం..’ కాంగ్రెస్ సర్కార్‌పై ప్రజాగ్రహం!
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పూటకో మాట.. రోజుకో నిర్ణయం అనే విధంగా పాలన సాగుతోందని ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో రవాణా రద్దీని తట్టుకునేందుకు ప్రణాళికలు వేయడం, కొన్ని రోజులకే వాటిని మార్చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రతిపాదించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టును అర్ధాంతరంగా రద్దు చేయడంపై పర్యావరణవేత్తలు, స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
