తెలంగాణ
KBR Park: నగరవాసులకు బిగ్ అలర్ట్.. కేబీఆర్ పార్క్ చుట్టూ కొత్త ట్రాఫిక్ రూల్స్.. ఈ నెల 18 నుంచి
KBR Park: హైదరాబాద్ నగర వాసులకు బిగ్ అలర్ట్. నగరంలోని అత్యంత కీలకమైన కేబీఆర్ పార్కు చుట్టూ కొత్త ట్రాఫిక్స్ రూల్స్ అమలు కానున్నాయి. పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ విధానం అమల్లోకి రానుంది. ఈ నెల 18వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఈ ప్రత్యేక వన్ వే ట్రాఫిక్ విధానం అమల్లోకి వస్తుందని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. పార్కు చుట్టూ అండర్ పాస్‌ల నిర్మాణం జరుగుతోంది. ఈ క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వన్ వే కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు.
