Kavya-Kala Bhairava: ప్రేమలో కావ్య, కాల భైరవ..ఇది ఎవరూ ఊహించనిది!
Tollywood: ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డ్ విన్నర్ అయిన ఎం.ఎం.కీరవాణి తనయుడు కాల భైరవ, యువ నటి కావ్య కళ్యాణ్‌రామ్ ప్రేమలో ఉన్నట్టుగా తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా తెలిపారు. కాల భైరవ-కావ్య కళ్యాణ్‌రామ్ ల ప్రేమ విషయం తెలిసి టాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పెళ్ళి వార్త ఎప్పుడు..ఏడేట్..ప్లేస్ ఎక్కడా అనే చర్చ మొదలైంది. కాల భైరవ సంగీత దర్శకుడిగా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలో 'నాటు నాటు' సాంగ్ పాడాడు. ఈ పాటకి ఆస్కార్ వచ్చింది. ఇందులోనే 'కొమరం భీముడో' సాంగ్ పాడాడు. 'బాహుబలి 2'లో 'దండాలయ్య', 'అరవింద సమేత'లో 'పెనివిటి' సాంగ్ పాడాడు. కాల భైరవ పాడిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. మనసంతా నువ్వే సినిమాతో కావ్య కళ్యాణ్‌రామ్ చైల్డ్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది. ఇక, పెద్దయ్యాక బలగం సినిమాతో హీరోయిన్గా బాగా గుర్తింపు తెచ్చుకుంది.
