తెలంగాణ

చిత్రపురి కాలనీలో అక్రమాలపై సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలి- కవిత

Kavitha: చిత్రపురి కాలనీ సోసైటీలో అవినీతి, అక్రమాలపై సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్న అనిల్ అనే వ్యక్తి.. సొసైటీలో పెద్దఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఒకే వ్యక్తి ఇంత అవినీతికి పాల్పడటానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని మంత్రుల సహకారం ఉందన్నారు. అనిల్ అవినీతిపై చర్యలు తీసుకుంటామని చెప్పి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని కవిత ప్రశ్నించారు. చిత్రపురి కాలనీ సాధన సమితి నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు కవిత.