తెలంగాణ

Kavitha: సీఎం రేవంత్ కాసుకో.. 20న కొడంగల్‌కు వస్తున్నా

Kavitha: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత. సీఎం రేవంత్ ను కరప్షన్ కింగ్ గా, అవినీతి సామ్రాట్ గా అభివర్ణించారు. కమీషన్లు తీసుకునే అవసరం నాకు లేదు, దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు అంటూ అసెంబ్లీలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు కవిత. ముఖ్యమంత్రి రేవంత్ మాటలను ఆమె ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. మూసీ నుంచి ఇసుక వరకు ప్రతీ దాంట్లో మీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ధ్వజమెత్తారు.

ఈ అంశాలన్నీ చెప్పేందుకు, ప్రజల ముందు తేటతెల్లం చేయడానికి, మీ పాపాల చిట్టా విప్పేందుకే ఈ నెల 20న కొడంగల్ కు వస్తున్నామని కవిత చెప్పారు. టీఆర్ఎస్ పాంచజన్య సంకల్ప సభ పెడుతున్నామన్నారు. మీ నియోజకవర్గంలో మీ గడ్డ మీద నిలబడి మీరు చేసిన అవినీతిని మొత్తం తెలంగాణ ప్రజలకు చెప్పబోతున్నామని కవిత ప్రకటించారు.