సినిమా

Karti 30: తమిళంలో మీనూకి క్రేజీ ఆఫర్!

Karti 30: తమిళ హీరో కార్తి నటిస్తున్న తన 30వ సినిమాలో సోలో హీరోయిన్‌గా మీనాక్షి ఎంపికైంది. ఇది గనక హిట్ అయితే, అక్కడ గుడి కట్టేయడం ఖాయం. తెలుగులో మీనాక్షికి మరో క్రేజీ ఆఫర్స్ వచ్చినట్టు, తాజాగా ఫిల్మ్ సర్కిల్స్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, బాబి కాంబోలో రూపొందుతున్న మెగా 158లో మీనాక్షి ఓ ఇంపార్టెంట్ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. చిరంజీవి సినిమా అంటే గ్యారెంటీగా మీనాక్షికి మచి రోల్ పడుతుంది. కాబట్టి, మెగా 158 కూడా కన్‌ఫర్మ్ అయితే, అటు తమిళ సినిమా, ఇటు తెలుగులో రెండు సినిమాలతో అలరించడానికి మీనూ రెడీ అవుతున్నట్టే.