క్రైమ్
కరీంనగర్లో వైద్యుడి విషాదాంతం.. పీజీ సీటు రాలేదన్న మనోవేదన కారణమా!?
పీజీ సీటు రాలేదనే మనోవేదనతో ఓ ఎంబీబీఎస్ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన కరీంనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. పసుల గౌతమ్ (39) ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేసి గత నాలుగేళ్లుగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ధర్మారం మండలంలోని నందిమేడారం, చొప్పదండి మండలంలోని కటికనపల్లి గ్రామాల్లోని పీహెచ్సీల్లో వైద్యుడిగా విధులు నిర్వహించాడు. సుమారు నెల రోజుల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటి వద్దనే ఉంటున్నాడు. గౌతమ్ గతంలో రెండుసార్లు పీజీ ప్రవేశ పరీక్ష రాసినప్పటికీ మెరిట్ మార్కులు రాకపోవడంతో సీటు లభించలేదు. దీంతో కొంతకాలంగా తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
