రాజకీయాలు

Karimnagar: హైకమాండ్ మాస్టర్ ప్లాన్.. కరీంనగర్ వేదికగా అమిత్ షా కీలక భేటీ!..

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రతిమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనడానికి ఈనెల 26న ఆయన కరీంనగర్‌కు రానున్నారు. అయితే ఈ పర్యటన కేవలం ఒక ప్రైవేట్ కార్యక్రమానికే పరిమితం కాదనే చర్చ బీజేపీ వర్గాల్లో జరుగుతోంది.

రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో పార్టీ బలోపేతం, నాయకుల మధ్య సమన్వయం, భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై ఈ భేటీలో కీలక చర్చ జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.