క్రైమ్

ప్రొఫెసర్ అవతారంలో ఉద్యోగాల దందా.. పోలీసులకు చిక్కిన కేటుగాడు!..

ఉద్యోగం ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను నమ్మించి లక్షల రూపాయలు వసూలు చేసిన మోసగాడిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. శాతవాహన యూనివర్సిటీలో బోటనీ ప్రొఫెసర్‌గా పరిచయం చేసుకున్న దుడపాక తిరుపతి.. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఏకంగా 21 మంది నుంచి రూ.44 లక్షలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. నకిలీ పరీక్షలు నిర్వహించడంతో పాటు ఫేక్ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు, OMR షీట్లు తయారు చేసి అభ్యర్థులను బురిడీ కొట్టించినట్లు విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.