తెలంగాణ
Karimnagar: కలెక్టరేట్ ముట్టడించిన పాలిటెక్నిక్ విద్యార్థులు.. జీవో 97 రద్దుకు పెరుగుతున్న డిమాండ్!..
తెలంగాణలో సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న వేలాది మంది పాలిటెక్నిక్ విద్యార్థుల్లో ప్రస్తుతం తీవ్ర ఆందోళన నెలకొంది. రాష్ట్ర విద్యాశాఖ ఇటీవల తీసుకువచ్చిన జీవో 97 ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.. ఒకవైపు ప్రభుత్వం ఈ ఉత్తర్వుల ద్వారా సాంకేతిక విద్యలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నామని చెబుతుంటే, మరోవైపు విద్యార్థి సంఘాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల సమస్యల ను పరిష్కరించాలని నిరసనకు దిగారు.. ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యను పరిరక్షించాలని, జీవో నం. 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు కలెక్టరేట్ ను ముట్టడించారు.
