Spirituality

మహాలక్ష్మి దేవిగా కనకదుర్గమ్మ.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తజనం!

 విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత కన్నులపండువగా, వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజైన శనివారం (అక్టోబర్ 17) కనకదుర్గమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారంలో భక్తులకు దివ్యదర్శనమిస్తున్నారు. అష్టలక్ష్మి సమన్వితగా, సర్వ సంపదలకు అధిదేవతగా భాసిల్లే శ్రీ మహాలక్ష్మి దేవి రూపంలో కొలువైన దుర్గమ్మను దర్శించుకునేందుకు వేకువజాము నుంచే భక్తులు ఇంద్రకీలాద్రికి భారీగా పోటెత్తారు. ఆలయ ప్రాంగణంతో పాటు కొండకింద క్యూలైన్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. సాధారణ భక్తులకు అమ్మవారి దర్శనం కోసం సుమారు 3 గంటలకు పైగా సమయం పడుతోంది.