తెలంగాణ

Kamalapur Sarpanch: బెల్ట్ షాపులపై చర్యలు ఏవి? అబ్కారీ శాఖ తీరుపై కమలాపూర్ సర్పంచ్ ఆగ్రహం

అబ్కారీ శాఖ నిర్లక్ష్యపు పనితీరుపై కమలాపూర్ సర్పంచ్ పబ్బు సతీష్, భీంపెళ్ళి సర్పంచ్ వాసాల శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కమలాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అబ్కారీ శాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ కమలాపూర్ సర్పంచ్ నిరసన తెలిపారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా అక్రమంగా బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయాలు సాగిస్తుండడంతో అనేక అనర్ధాలు చోటు చేసుకుంటున్నాయని, అనేక కుటుంబాలు ఆగమవుతున్నాయని, బెల్ట్ షాపులు నిషేధించాలన్న మహిళల అభ్యర్థన మేరకు కమలాపూర్ లో బెల్ట్ షాపులు నిషేధిస్తూ తీర్మానం చేశామన్నారు.