తెలంగాణ

TG : పిల్లలు పుట్టాక కళ్యాణలక్ష్మికి మోక్షం.. వీడియో వైరల్!

పేదింటి ఆడబిడ్డల పెళ్లికి సాయంగా గత ప్రభుత్వం అందజేసిన కళ్యాణలక్ష్మి చెక్కులు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో రావడం లేదని తెలుస్తోంది. దీంతో కళ్యాణలక్ష్మి కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఏళ్లుగా ఎదురుచూపులు చూడాల్సి వస్తోంది.గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆడిపిల్ల పెళ్లయిన నెల రోజులలోపు కళ్యాణలక్ష్మి సాయం అందించేవారు.అది ఆడపిల్ల తండ్రికి భరోసాగా నిలిచేది. ప్రస్తుతం నెలల తరబడి ఎదురుచూసినా చెక్కులు ఇవ్వడం లేదు. ఇదేంటని అడిగితే నిధులు లేవని, అందుకే ఆలస్యం అవుతోందని స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి పెళ్లయిన తర్వాత అందాల్సిన కళ్యాణలక్ష్మి చెక్కును ఓ మహిళ తనకు పాప పుట్టాక అందుకున్నది. జగిత్యాలలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పెళ్లయి పాప పుట్టిన మహిళకు కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ చెక్కు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.