తెలంగాణ

TG: నవంబర్‌ నుంచి కాళేశ్వరం పునరుద్ధరణ పనులు మొదలుపెడతాం: మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

TG: తెలంగాణ సాగునీటి రంగంలో అత్యంత కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల పునరుద్ధరణపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణను ప్రకటించింది. తీవ్ర వివాదాస్పదమైన మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతు, పునరుద్ధరణ పనులను నవంబర్ రెండో వారం నుంచి అధికారికంగా ప్రారంభిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. జలసౌధలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ కీలక వివరాలను వెల్లడించారు.ప్రాజెక్టు పునరుద్ధరణ పనులను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే సమగ్ర నివేదికలను సిద్ధం చేసింది. కేంద్ర జల సంఘం (CWC) సాంకేతిక పర్యవేక్షణ కమిటీకి అక్టోబర్ 5న తుది డిజైన్లను సమర్పించనున్నట్లు మంత్రి తెలిపారు.